• 6 years ago
Talking in the interview, Hemal Ingle said, she likes Vijay Devarakonda very much and she watching every movie of Vijay Devarakonda.
యూత్ ఫుల్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన హుషారు సినిమా డిసెంబర్ 7న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు.ఈ సందర్భంగా హీరోయిన్‌ హేమల్‌ ఇంగ్లే తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. హుషారు మూవీ నాకు మొదటి సినిమా. బేసిగ్గా మరాఠీ అమ్మాయిని. హుషారు తర్వాత రెండు మరాఠీ సినిమాల్లో నటించాను. వచ్చే ఏడాది ఆ సినిమాలు రిలీజ్ కానున్నాయి. హుషారు సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. యూత్‌కే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. నేను వారిలాగానే ఐ లవ్ విజయ్ దేవరకొండ. అతడి యాటిట్యూడ్, స్టయిల్ నాకు నచ్చుతుంది. అవకాశం వస్తే విజయ్‌తో నటించాలని ఉంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. తాప్సీ పొన్ను అంటే ఇష్టం. ఆమె ఎంపిక చేసుకొనే పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆమె నటించిన సినిమాల్లోని పాత్రల్లో ఇంటెన్సిటీ బాగా ఇష్టం.
#Husharu
#HemaIngle
#TejasKancharla
#TejKurapati
#DakshaNagarkar
#VijayDevarakonda

Recommended