• 6 years ago
Janasena Chief Pawan Kalyan said that his party would be contesting in all the 175 constituencies in Andhra pradesh and gave a clarity that Janasena would only endup in ally with communists. This tweet from Pawan Kalyan came amid the statement made by AP CM Chandrababu naidu that what is wrong when Pawan allied with TDP.
#pawankalyan
#janasena
#2019assemblyelections
#Chandrababunaidu
#TDP
#leftparties
#Andhrapradesh
#communistparties


పవన్ కళ్యాణ్ తమతో కలిసి పోటీ చేస్తే తప్పేముందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. తాము వామపక్షాలతో తప్ప మరెవరితో కలిసి 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేయమని స్పష్టం చేశారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తుందని చెప్పారు. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం కల్పిస్తామని జనసేనాని స్పష్టం చేశారు. అధికార పక్షం ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దంటూ వాటిని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఏపీలో 2019 సాధారణ ఎన్నికలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. త్రిముఖ పోటీ ఏపీలో నెలకొనడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ... ఆ తర్వాత కొన్ని మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్‌బై చెప్పేశాడు. ప్రస్తుతం ఆయన తన పార్టీ నిర్మాణ కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీచేస్తే తప్పేంటి అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు బీజేపీయేతర పార్టీలతో పవన్ జట్టు కట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం మరింత డోలాయమానంకు గురించేసింది. ఎంతలా అంటే పవన్ తిరిగి చంద్రబాబుకు మద్దతు పలుకుతారా అనే చర్చ కూడా మొదలైంది.

Category

🗞
News

Recommended