India vs Australia 4th Test : India is the only side to declare in three consecutive innings against Australia. They have done it twice - first in 2008 In Mohali & Delhi in India and now in this series
#IndiavsAustralia4thTest
#AusvInd
#teamindia
#RishabhPant
#pujara
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాపై వరుసగా మూడు ఇన్నింగ్స్‌లను డిక్లేర్ చేసిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై ఇలా చేయడం భారత్‌కు ఇది రెండోసారి. గతంలో 2008లో భారత్‌లో జరిగిన మొహాలీ, ఢిల్లీ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై వరుసగా మూడు ఇన్నింగ్స్‌లను డిక్లేర్ చేశారు. ఆ సిరీస్‌లో టీమిండియా విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా మరోసారి ఈ ఘనత సాధించింది. దీంతో పాటు ఒకే గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై 600కుపైగా పరుగులను మూడు సార్లు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ రికార్డుని టీమిండియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే సాధించడం విశేషం. గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా 622/7 వద్ద డిక్లేర్ చేయడంతో ఈ గ్రౌండ్‌లో అత్యధికంగా మూడు సార్లు 600కుపైగా పరుగులు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. ఈ గ్రౌండ్‌లో టీమిండియా అత్యధిక స్కోరు 705/7 డిక్లేర్డ్.

Category
🥇
Sports