• 6 years ago
Virat Kohli labelled India's Test series victory over Australia as his biggest achievement, though the star captain warned there is more to come from his side. Day five of the fourth and final Test was washed out at the SCG in Sydney as India secured a 2-1 series triumph against beleaguered Australia on Monday.
#indiavsaustralia
#india
#australia
#Sydney
#pant
#pujara

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డులు తిరగరాసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేశారు. చివరి రోజు మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసింది. దీంతో సిడ్నీ టెస్టును 'డ్రా'గా ముగించడంతో 2-1 తేడాతో గవాస్కర్‌ - బోర్డర్‌ సిరీస్‌‌ను గెలిచి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లీ సేన సాకారం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్లలో తొలి సారి టెస్టు సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకోవడం విశేషం. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో మాత్రం భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.

Category

🥇
Sports

Recommended