• 5 years ago
Medchal kandlakoya oxygen park lovers marriage gear reversed. Complaint filed on six persons who were seen in viral video acted as bhajrang dal activists. Those activists are take into control by Medchal police.
#valentinesday2019
#lovemarriage
#takeintocustody
#bajrangdal
#cyberabadpolice
#telangana
#sriharachary
#anand
#chandrashekar
#avinash
#sureshkumar

వాలంటైన్స్ డే నాడు ప్రేమజంటకు బలవంతంగా పెళ్లి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీవిల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేమ పెళ్లి తంతు వెలుగుచూసింది. పెళ్లి చేసినోళ్లే వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేయడంతో క్షణాల్లో సమాచారం స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఆ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆరుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమికుల రోజున మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో చోటుచేసుకున్న ఘటన సీరియస్ గా మారింది. ఓ అమ్మాయి, అబ్బాయి పార్కులో కనిపించడంతో కొందరు యువకులు వారిద్దరికీ పెళ్లి చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమ జంటకు పెళ్లి చేశారన్న వార్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ పెళ్లి తతంగం కూడా ఆ యువకులే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది జరిగిన గంట వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆ న్యూస్ చర్చానీయాంశంగా మారింది. టీవిల్లో, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది.

అల్వాల్ ప్రాంతంలో ఉంటున్న ఓ యువతి (19సం.) కండ్లకోయ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే సిద్ధిపేటకు చెందిన దూరపు బంధువుతో కలిసి ఆక్సిజన్ పార్క్ కు వెళ్లింది. అయితే వాలంటైన్స్ డే కావడంతో కొందరు యువకులు వీరిని అడ్డగించారు. వారు చెప్పేది వినకుండా బలవంతంగా పెళ్లి జరిపించారు. క్షణాల్లో ప్రసారమాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు అలర్టయ్యారు. వీడియో ఆధారంగా ఆ యువకులను గుర్తించే పనిలో పడ్డారు.

Category

🗞
News

Recommended