• 6 years ago
KCR is expected to have a cabinet expansion as Assembly Budget Session begins on May 22 this year. The green signal was given to the cabinet expansion on 19th.
#cabinetexpansion
#telangana
#cabinet
#cmkcr
#ministers
#19thfeb
#mlas
#governornarasimhan
#greensignal
#assembly
#budgetmeetings
#cmo


తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఫైనల్ గా ముహుర్తం ఖరారైంది. 66 రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ కూర్పుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సుదీర్ఘ కాలంగా నాన్చుతూ వచ్చిన సీఎం కేసీఆర్ ఎట్టకేలకు కొత్త మంత్రులకు పచ్చజెండా ఊపారు. దాదాపు పదిమందికి పైగా ఆమాత్యులుగా అవకాశం దక్కనుంది. శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మేరకు సీఎంవో కార్యాలయం నుంచి నోట్ విడుదల కావడంతో మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లైంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22న ప్రారంభం కానుండటంతో అంతకుముందే మంత్రివర్గ విస్తరణ జరగాలని కేసీఆర్ భావించారు. దాంతో 19వ తేదీన కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రోజు మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో మంచి రోజుగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Category

🗞
News

Recommended