• 6 years ago
Board of Control for Cricket in India (BCCI) acting President CK Khanna on Sunday appealed Committee of Administrators (CoA) chief Vinod Rai to contribute at least Rs 5 crore to the families of CRPF troopers who lost their lives in Pulwama tragedy.
#Pulwamatragedy
#BCCI
#CKKhanna
#CoA
#VinodRai
#CRPFfamilies
#cricket
#teamindia

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ దేశం బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా భారత్‌ క్రికెట్ ‌నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా తనవంతు సాయంగా దాదాపు రూ.5 కోట్లు విరాళం ఇవ్వాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌కు లేఖ రాశారు.
"పుల్వామా ఉగ్రదాడి ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అమర జవాన్ల కుటుంబాలకు పూర్తి సానుభూతి ప్రకటిస్తున్నా. ఇతర భారతీయులలాగే మేం కూడా చాలా బాధపడుతున్నాం. సీవోఏకు నా విన్నపం ఒక్కటే. ఆ కుటుంబాలకు కనీసం రూ. 5 కోట్లు ఇవ్వాలని సీఓఏకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఆయన లేఖ రాశారు.

Category

🥇
Sports

Recommended