• 6 years ago
Actress Raksha shared some interesting details in a tv show. Rani also known as Raksha is an Indian actress who appears in Tamil, Telugu, Kannada and Hindi films. She won Andhra Pradesh government Nandi award for best supporting actress for the film Nachavule.
#raksha
#tollywood
#nachavule
#kollywood
#movienews
#alithosaradaga
#tamilactress

తెలుగు నటి రాణి అలియాస్ రక్ష అంటే ఎవరూ అంత త్వరగా గుర్తు పట్టక పోవచ్చు కానీ... అజిత్, దేవయాని మూవీ 'ప్రేమ లేఖలు' చిత్రంలో ట్రైన్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే 'చిన్నాదాన ఓసి చిన్నాదాన' అనే స్పెషల్ సాంగులో నటించిన బ్యూటీ అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 30కిపైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రక్ష... హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత రవిబాబు మూవీ 'నచ్చావులే'లో తల్లి పాత్ర ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ చిత్రానికి ఆమె నంది అవార్డు గెలుచుకున్నారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న రక్ష పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Recommended