రావణాసురుడుగా ప్రభాస్, సీతగా దీపికా, రాముడుగా హృతిక్

  • 5 years ago
#Prabhas #ravana #DeepikaPadukone #Sita #HritikRoshan #Rama 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ హీరోగా మారిపోయిన టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్... ఇటీవల 'సాహో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయితే, కలెక్షన్ల పరంగా ఔరా అనిపించింది. కానీ, అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులో రావణాసురుడుగా కనిపించనున్నారట. ఇందులో సీత పాత్రను దీపికా పదుకొనె చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించబోతున్నారు.

ఈ ప్రాజెక్టును రూ.600 కోట్ల వ్యయంతో మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఇందులో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు ప్రభాస్‌ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, ఆయన టీమ్‌ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్‌ చేయొచ్చా లేదా? అన్నది బేరిజువేసే పనిలో ఉందని పింక్‌విల్లా వెబ్‌సైట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

కాగా, ఈ ప్రాజెక్టును ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రభాస్‌కు ఉన్న దేశవ్యాప్త స్టార్‌డమ్‌తోపాటు హైట్‌, పర్సనాలిటీపరంగా రావణుడి పాత్రకు సరిగ్గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రభాస్‌ రావణుడి పాత్రను చేస్తే.. ఆ పాత్రకు న్యాయం చేయడమేకాకుండా ప్రజల్లో మరింత హైప్‌ వచ్చే అవకాశముంటుందన్నది చిత్ర యూనిట్ భావన.

మరోవైపు రాముడిగా హృతిక్‌ రోషన్‌, సీతగా దీపికా పదుకొణె నటించే అవకాశముండటంతో వారికి ధీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్‌ అలరించే అవకాశముంటని బాలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతారాములుగా హృతిక్‌, దీపిక నటించనున్నారని కథనాలు రాగా.. ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్‌ ఫైనల్‌ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్‌ కొట్టిపారేశారు. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more.

► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Telugu-190322267658012/
► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu
► Visit Website: https://telugu.webdunia.com/
► Follow Webdunia Telugu on Helo: https://studio.helo-app.com/