BJP leader Vijayashanti clarifies on her silence over active politics in Telangana Ahead of Munugode bypoll | మొన్నటి వరకూ క్రియాశీలకంగా వ్యవహరించిన విజయశాంతి అలకపూనినట్లు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, అక్కడ నిర్వహించ దలచిన భారీ బహిరంగ సభ కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతి ఎక్కడా కనిపించట్లేదు.. ఆమె పేరూ వినిపించట్లేదు. మునుగోడు ఉప ఎన్నికకు విజయశాంతి స్టార్ క్యాంపెయినర్‌గా మారుతారని అందరూ భావించినప్పటికీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. విజయశాంతికి ధీటుగా పార్టీలోకి మాజీ శాసన సభ్యురాలు, సినీ పరిశ్రమకే చెందిన జయసుధను తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. దీనివల్లే విజయశాంతి పార్టీకి దూరం అయ్యారా? అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. మునుగోడు ఉప ఎన్నిక కోసం సమాయాత్తమౌతోన్న వేళ.. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న విజయశాంతి సేవలను పార్టీ ఎందుకు ఉపయోగించుకోవట్లేదనేది చర్చనీయాంశమైంది.
#Munugodebypoll
#Vijayashanti
#komatireddy
#Telangana
#Munugodebypoll
#Vijayashanti
#komatireddy
#Telangana
Category
🗞
News