• 3 years ago
IND vs SA - David Miller says It Was Very Tough After Losing The 3rd ODI Against India | పిచ్ కఠినంగా ఉండటంతోనే భారత్‌తో మూడో వన్డేలో ఘోర పరాజయం చవి చూసామని సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డేవిడ్ మిల్లర్ అన్నాడు. వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో బౌలర్లకు అనుకూలించిందని, బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందన్నాడు. మంగళవారం ఏకపక్షంగా ముగిసిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ మిల్లర్.. ఈ పరాజయం తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు.

#DavidMiller
#IndiavsSouthafrica
#ShikharDhawan
#Cricket
#National
#INDvsSA

Category

🥇
Sports

Recommended