• 2 years ago
BCCI name Jasprit Bumrah replacement in India T20 World Cup squad | టీ20 ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఊహించినట్లుగానే మహమ్మద్ షమీని ఎంపికచేశారు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి అక్టోబర్ 15 తుది గడవుకాగా.. బీసీసీఐ ఒకరోజు ముందుగానే బుమ్రా రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇక ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన జస్‌ప్రీత్ బుమ్రా.. వెన్నుగాయంతో టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతనికి బ్యాకప్‌గా మహమ్మద్ షమీని రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేసినా.. అతను కరోనా బారిన పడటంతో ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఎన్‌సీఏలో షమీకి రెండు ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించగా.. రెండూ క్లియర్ చేశాడు. దాంతో ఆస్ట్రేలియాకు పంపించిన బీసీసీఐ.. టీమ్‌మేనేజ్‌మెంట్ సూచనలతో తుది నిర్ణయం ప్రకటించింది.

#JaspritBumrah
#T20WorldCup
#MohammadShami
#DeepakChahar
#Australia
#Cricket
#BCCI

Category

🥇
Sports

Recommended