• 3 years ago

IND vs PAK - India chasing 160 as Arshdeep-Hardik help restrict Pakistan to 159/8 | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను వణికించారు. సూపర్ బౌలింగ్‌తో ఆ జట్టును 160 పరుగులు సాధారణ లక్ష్యానికే పరిమితం చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. పాక్‌లో వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది.


#T20WorldCup2022
#INDvsPAK
#MelbourneCricketGround
#indiavspakistan
#t20worldcup2022
#MCG
#rohitsharma
#babarazam
#viratkohli

Category

🗞
News

Recommended