Pawan Kalyan About Gifts: రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటులో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు. బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ని కలిశారు. ఇకపై తనని కలవడానికి వచ్చేవారు విగ్రహాలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలకు బదులుగా కూరగాయలు లాంటివి ఇవ్వాలని కోరారు. కళ్లకు ఇంపుగా, నిండుగా కనిపించేవి కాకుండా పది మంది కడుపు నింపేవి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
Category
🗞
News