Police Recovered Lost And Stolen Cell Phones On Chatbot : పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా పోలీసుశాఖ రికార్డు సృష్టించింది. శుక్రవారం ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో 1,183 మందికి ఫోన్లను అప్పగించారు. చోరికి గురైన రూ. 2.9 కోట్ల విలువైన సెల్ ఫోన్లను అనంతపురం పోలీసులు చాట్ బాట్ ప్రత్యేక యాప్‌తో గుర్తించి బాధితులకు ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన ఫోన్ల సంఖ్య 11,378కు చేరుకుందని ఎస్పీ ఈ సందర్భంగా ప్రకటించారు. వీటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని, సెల్‌ఫోన్ల రికవరీలో దేశంలోనే అనంతపురం పోలీసులు అగ్రస్థానంలో నిలిచారన్నారు.
Category
🗞
News