CRDA Focus on Iconic Towers : రాజధాని అమరావతి నిర్మాణంలో పాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదు టవర్ల పనులను ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభించేందుకు సీఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది. వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడేయించారు. ర్యాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడింది. దీంతో మరోసారి ఐఐటీ మద్రాసు సివిల్ ఇంజినీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Category
🗞
News