మంచినీళ్లు ఎందుకు కొంటాం. బాగా దాహం వేసి ప్రాణం పోయే స్థితిలో ఉంటే బయట వాటర్ బాటిల్ కొంటాం. అలాంటిది వాటర్ బాటిల్స్ మీద ఎక్స్ ట్రా ఛార్జ్ వేసిన ఓ హోటల్ పై జన్మలో మర్చిపోలేనంత ఫైన్ వేసింది కాకినాడ వినియోగదారుల ఫోరం. కాకినాడకు చెందిన కుసుమ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్ కి వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్లో మూడు వాటర్ బాటిల్స్ కొన్నాడు. బాటిల్ 20 రూపాయల చొప్పును మూడు బాటిళ్లకు 60 రూపాయలు తీసుకోవటానికి బదులుగా 87 రూపాయల ఛార్జ్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బాటిళ్లు కొన్న కుసుమ కళ్యాణ్ కాకినాడకు తిరిగొచ్చిన తర్వాత కన్జ్యూమర్స్ ఫోరంను ఆశ్రయించాడు. దీంతో హోటల్ యాజమానాన్యానికి నోటీసులు పంపింది కన్జ్యూమర్స్ ఫోరం. అయినా వాటికి హోటల్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో 27 రూపాయలు అదనంగా వసూలు చేసినందుకు 27 లక్షల ఇరవై ఏడు వేలు పెనాల్టీ కట్టు తీరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కటే అమౌంట్ లో 25 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, 25వేలు వినియోగదారుడికి 2000 కోర్టుకి హోటల్ యజమాన్యం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షులు రఘుపతి , మెంబర్ సుశి మీడియాకు వివరాలు అందించారు..Bytes
Category
🗞
News