Skip to playerSkip to main contentSkip to footer
  • 3/9/2025
Heavy Fog on Hyderabad-Warangal highway : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారులోని బైపాస్ రహదారిపై ఈరోజు ఉదయం మంచు భారీగా కమ్మేసింది. దీంతో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై వాహనాలు ఫాగ్ లైట్, హెడ్ లైట్​ల వెలుతురులో నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా మంచు కమ్మేయటంతో రహదారి కనిపించని పరిస్థితి నెలకొంది. మరోవైపు మంచు దుప్పటితో స్థానికులు సరికొత్త అనుభూతిని పొందారు. అయితే పొగ మంచు వేళ ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరి వరకు వస్తే కానీ కనిపించవు. రోడ్డుపక్కన ఆగి ఉన్న వాహనాలు కనిపించక స్పీడ్‌గా వెళ్లి వాటిని ఢీకొని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

Category

🗞
News

Recommended