తెలుగు telugu File Folder Locking docLock Full HD Nallamotu

  • 13 years ago
మన కంప్యూటర్లో ఉన్న ముఖ్యమైన ఫ్లైళ్లనీ, ఫోల్డర్లనీ ఇతరులు ఓపెన్ చేయకుండా లాక్ చేయడానికి అనేక సాఫ్ట్ వేర్లు ఉన్నా సక్రమంగా పనిచేసేవి తక్కువే. LargeSoftware సంస్థ రిలీజ్ చేసిన docLock అనే సాఫ్ట్ వేర్ అద్భుతమైన ఎన్ క్రిష్షన్ సదుపాయాలతో చాలా శక్తివంతంగా పనిచేస్తోంది.

డౌన్ లోడ్ లింక్: http://www.largesoftware.com/html/doclock.html
ధర: 29.95 డాలర్లు (రూ. 1,332)

ఇది అందిస్తున్న సదుపాయాలు:

ఫ్లైళ్లు, ఫోల్డర్లు, ఫొటోలు, వీడియోలు, జిప్ ఫ్లైళ్లు వంటి వాటిని పాస్ వర్డ్ తో రక్షించుకోవచ్చు.

ఫ్లైళ్లని డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం ద్వారా సులభంగా లాక్ చేసుకోవచ్చు, unlock చేసుకోవచ్చు.

docLockతో లాక్ చేసిన ఫైళ్లని ఇ-మెయిల్ ద్వారా, పెన్ డ్రైవ్ ల ద్వారానూ షేర్ చేసుకోవచ్చు. అవతలి వారి కంప్యూటర్లో ఈ సాఫ్ట్ వేర్ ఉండాల్సిన పనిలేదు.

లాక్ చేసేటప్పుడు ఏ పాస్ వర్డ్ వాడాలో గుర్తు రాకపోతే ఈ ప్రోగ్రామే బలమైన పాస్ వర్డ్ లను మనకు సూచిస్తుంది.

ఫైళ్లనీ, ఫోల్డర్లనీ లాక్ చేసిన తర్వాత ఆ పాస్ వర్డ్ ని గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటే ఆ పాస్ వర్డ్ ఏదైనా ఫొటోలో భద్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

Category

🤖
Tech

Recommended