Ap Assembly Sessions : ప్రాణాలు పోతున్నాయ్! ఏం మాట్లాడుతున్నారు

  • 7 years ago
TDP MLS Gali Muddu Krishnama Naidu on Wednesday lashed out at health department. After Health minister Kamineni Srinivas replied to him.

బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య మాటల యుద్ధం జరిగింది. జిల్లాలో ప్రజలు రోగాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైద్య అధికారుల్లో చలనం లేకుండా పోయిందని గాలి అన్నారు.
డెంగ్యూ, అంటు వ్యాధులతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అవుతోందని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించడం లేదని గాలి ముద్దుకృష్ణమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతేగాక, జిల్లాలో సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో చెన్నై, బెంగళూరుకు ప్రజలు వెళుతున్నారని తెలిపారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి గత 9 ఏళ్లుగా ఈ జిల్లాలోనే పని చేస్తున్నారని... ఉపాధ్యాయులను కూడా రెండు మూడేళ్లకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని, కానీ ఆమెను ఇదే జిల్లాలో ఎందుకు ఉంచారని మంత్రిని గాలి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను మెడాల్ అనే కంపెనీకి అప్పగించారని... మెడాల్ పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారని గాలి ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేస్తున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయని అన్నారు.

Recommended