ఆ సంఘటన తర్వాతే ఆత్మహత్య ! విజయ్ తల్లి స్టేట్మెంట్..!

  • 7 years ago
Bommarillu & Ammayilu Abbayilu Fame Comedian Vijay is no more.. "My son committed that because of his wife." telugu actor Vijay's mother told to media.

తెలుగు నటుడు విజయ్ ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన వెనక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం అవకాశాలు లేక పోవడం కారణం కాదని, కుటుంబ కలహాలు అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశాయని తెలుస్తోంది.
తన కొడుకు చావుకు కారణం కోడలు వనిత అని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. మూడు సంవత్సరాలుగా ఇద్దరూ విడిగానే ఉంటున్నారని, ఆమె చేస్తున్న పనుల వల్లే తన కొడుకు మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు.
తాము ఇన్నాళ్లు ఎలాంటి మాట పడకుండా జీవిస్తున్నామని, కానీ తన కోడలు తమను బజారుకు లాగిందని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. ఆమె కారణంగా తన కొడుకు విజయ్ చాలా కుమిలిపోయేవాడని తెలిపారు.

Recommended