• 7 years ago
Stylish Star Allu Arjun is all set to introduce a new director soon. The actor is planning to float his own production house and start producing movies on his own.


ఈ మధ్య కాలం లో ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. మూస సినిమాలు చేస్తే.. కలెక్షన్లు వస్తాయోమే గానీ.. ఒక్కసారి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఒక్క మంచి సినిమా ఉండదు. బహుశా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూస నుంచి కాస్త పక్కకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ విపరీతంగా నచ్చడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దర్శకుడిగా అనుభవం లేకపోయినా సరే.. ఆ కథలో ఉన్న కంటెంట్ రీత్యా.. సినిమా చేయడానికి బన్నీ వెనుకాడట్లేదట.
అను రెడ్డి అనే ఓ యువ దర్శకుడు బన్నీకి కథ వినిపించాడట. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ కొత్తగా అనిపించడంతో తన ప్రొడక్షన్ లోనే చేస్తే బాగుంటుందని బన్నీ అనుకుంటున్నాడట. అయితే కొత్త దర్శకుడిని నమ్మి సినిమాను చేతిలో పెడుదామా?.. వద్దా?.. అన్న డైలామా మాత్రం వెంటాడుతోందట.

Recommended