చంద్రబాబు ఎంతఘోరంగా ఎన్టీఆర్‌ని దెబ్బతీసారో నాకు తెలుసు !

  • 7 years ago
ABK Prasad on current politics. he lashes out at pawan kalyan and chandrababu including modi and kcr.



ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు ఏబీకే ప్రసాద్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏబీకే ప్రసాద్.. జనసేన తాజా పరిణామాలపై స్పందించారు. అసలు ఆ సెక్షన్ గురించి తడమడమే అనవసరమని ఆయన చెప్పారు.పవన్ ఎప్పుడు నిలబడతాడో, ఎక్కడ నిలబడతాడోనన్నది ఎవరికీ అర్థంకాని విషయమని ఏబీకే ప్రసాద్య వ్యాఖ్యానించారు. కొంతమంది లేస్తే మనిషిని కాదని చెబుతుంటారని, పవన్ కళ్యాణ్ కు లేవడమే గగనమైపోయిందని అన్నారు

కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌ ముగ్గురూ నిరంకుశమైన ఆలోచనా విధానం ఉన్నవారే. ఏ విషయంలో అయినా సరే వీరి వైఖరి అప్రజాస్వామికం. పాలకులు తమ ఉనికికోసం కొన్ని మంచిపనులు చేయడం తప్పదు. కానీ, వాటిని ఆధారం చేసుకుని వారి పాలన మొత్తం గొప్పది అని చెప్పలేం. ప్రజలకు కొన్ని తాయిలాలు ఇస్తున్నారు. దాంతో వీరేదో కొంత మేలు చేస్తున్నారు అనే భ్రమల్లోంచి జనం బయటపడటం లేదు' అని ఏబీకే అన్నారు.మొత్తం ప్రాజెక్టు విషయంలో ఒక ప్రాతిపదిక లేకుండా చంద్రబాబు ముందుకు వెళ్లాడు. ప్రత్యేక హోదాతో ముడిపడిన అన్ని అంశాలను ఆ ప్రత్యేక హోదా లేకుండా వస్తాయని అనుకోవడం పెద్ద భ్రమ. అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే అతి ప్రధాన కర్తవ్యమైపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదానే లేదు. విభజన చట్టంలో ప్రకటించిన 16 వేల కోట్ల రూపాయలనే ఇవ్వడానికి సిద్ధపడిన కేంద్రం.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు పెంచిన 60 వేల కోట్లను ఇవ్వమంటే ఎందుకిస్తుంది?' అని ఏబీకే ప్రశ్నించారు.

Recommended