Wives who made lost lives their hausbands in Telangana and Andhra Pradesh became hot topics after Swathi's incident.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. కొండమల్లెపల్లి మండలం ఏపూరు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమె భర్తను చంపేసింది. భర్త సోమాను హత్య చేసిన ఉదంతంలో పోలీసులు భార్య భారతిని అరెస్టు చేశారు. వరుసకు బావ అయ్యే రమావత్ శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. డిసెంబర్ 28 రాత్రి మద్యం మత్తులో ఉన్న సోమ భార్య, కుమారుడితో గొడవ పడి నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన భారతి ప్రియుడు శివకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. భారతి, ప్రియుడు శివ ఇద్దరూ కలిసి హత్య చేశారు.
తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో భర్తను భార్య చంపింది. మల్లూరి భిక్షపతి (33)కి బాయక్కతో 16 ఏళ్ల కింద వివాహం జరిగింది. బాయక్కకు అదే గ్రామానికి చెందిన ఓ మాజీ నక్సలైట్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డు ఉన్నాడనే కారణంతో భర్త భిక్షపతిని చంపాలని బాయక్క పథకం వేసి హత్య చేసింది.
కరీంనగర్ పట్టణ శివారులో 2015 ఆగస్టులో ఓ భార్య తన భర్తను చంపింది. అయితే ఇది అక్రమ సంబంధానికి సంబంధించింది కాదని తెలుస్తోంది. మృతుడు ఎండీ సాబీర్(45) గత కొంత కాలంగా రోజు మద్యం తాగివచ్చి గొడవ చేస్తుంటే అది తట్టుకోలేకనే షహనాజ్ చున్నితో అతని మెడకు బిగించి హత్యచేసినట్లు తెలుస్తోంది.

Category
🗞
News