Television anchor Pradeep Machiraju has landed in a huge trouble having caught in drunk & drive by the Hyderabad Traffic Police.
బుల్లితెర యాంకర్ ప్రదీప్ డ్రంక్ డ్రైవ్ వ్యవహారం మీడియాలో హల్‌చల్ చేసింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ప్రదీప్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రదీప్ పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరుకాకుండా కనిపించకుండా పోవడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంపై ప్రదీప్ రెండు రోజుల తర్వాత వీడియో ఫుటేజ్ ద్వారా స్పందించారు. మద్యం తాగి వాహనం నడపడం తప్పే. ముందస్తు షెడ్యూల్ కారణంగా నేను కౌన్సెలింగ్ హాజరుకాలేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు క్షమించండి అని ప్రదీప్ పేర్కన్నారు.
ప్రదీప్ వీడియో ఫుటేజ్‌పై ఫ్యాన్స్, నెటిజన్లు స్పందించారు. కొందరు ప్రదీప్‌ను చూసి జాలిపడ్డారు. మరికొందరు అతడికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఆసక్తికరమైన వ్యాఖ్యను పోస్ట్ చేశారు.
ప్రదీప్ వ్యవహారంపై పోలీసులను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్.. సార్ మా యాంకర్ ప్రదీప్‌ను వదిలేయండి. పాపం చిన్న పిల్లాడు. తెలియక చేశాడు అని ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు.
నెటిజన్ పోస్ట్‌ను చూసిన ట్రాఫిక్ పోలీసులు ఓ చురక అంటించారు. మేము ఎవరినీ అగౌరవ పరచం. చిన్నపిల్లాడు అయితే పాలు తాగాలి కానీ మందు తాగి వాహనం నడపడం కరెక్ట్ కాదు కాదా? సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని పోలీసులు పేర్కొన్నారు.

Category
🎥
Short film