బీజేపీతో కలిసినడుస్తాం, కానీ ఒక కండిషన్ !

  • 6 years ago
YS Jaganmohan Reddy on Monday said that his YSRC party was ready to enter into an alliance with the BJP for the 2019 election.

బీజేపీతో పొత్తుపై ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. మరో ఆలోచన లేకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్ర 900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ చానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. హోదా ఇచ్చే అధికారం ప్రధానమంత్రికి ఉందని, ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా 2019 లో బీజేపీతో కలిసి నడవటానికి అభ్యంతరం లేదన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా అడగకపోవడం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అసలు సీఎం చంద్రబాబు నాయుడికి రాజధాని నగర నిర్మాణంలో చిత్తశుద్ధి ఏమాత్రం లేదని, ఆయన ఓవైపు ప్రధానమంత్రిని, మరోవైపు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ అన్నారు.

Recommended