పవన్ బాబుని ఇరుకున పెట్టాడ?

  • 6 years ago
Andhrapradesh ruling party TDP fearing of Operation Garuda. Speculations widely spreading on this, BJP is trying to find out corruption statistics in Andhrapradesh with this operation

2014 ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన.. ఇప్పుడు శత్రువులుగా మారిపోవడం రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనేదానికి అద్దం పడుతోంది.
ఏపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిందనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణ. పవన్ ఆరోపణల్లో 90శాతం నిజం ఉందని అటు బీజేపీ కూడా ఇదే వాదన వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరిగే ప్రమాదం ఏర్పడింది. ఇంతలోనే కేంద్రం 'ఆపరేషన్ గరుడ' అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న విషయం తెలిసి టీడీపీ మరింత ఉలికిపడుతోంది.
లోకేష్ అవినీతి గురించి మాకు తెలియదు కానీ, రాష్ట్రంలో ఇసుక మాఫియా, విశాఖ భూముల కబ్జా, రాజధాని భూసేకరణ, అలాగే పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది అందరికీ తెలిసిన సత్యమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అవినీతిని లెక్కలతో సహా బయటపెట్టేందుకే కేంద్రం 'ఆపరేషన్ గరుడ' అనే అస్త్రాన్ని సంధించినట్టు చెబుతున్నారు.
అటు చంద్రబాబు సైతం టీడీపీ నాయకులను అలర్ట్ చేశారని తెలుస్తోంది. కేంద్రం ఎప్పుడు ఎలాంటి చర్యలకు దిగుతుందో తెలియదు కాబట్టి.. నేతలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం.
సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు కూడా ఆ పార్టీకి బిగ్ డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. రాష్ట్రంలో అవినీతిపై విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కోరుతుండటం కూడా ఆ పార్టీని ఇరుకునపెట్టేదిగా మారింది. పవన్ కల్యాణ్ పట్ల విశ్వసనీయత కలిగిన అభిమానులు, కొన్ని వర్గాల ప్రజలు ఈ ఆరోపణలు నిజమేనని భావిస్తున్నారు. పైగా ఏ తప్పు చేయకపోతే.. విచారణ అంటే ఉలిక్కి పడటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే... చంద్రబాబు ప్రభుత్వాన్ని కేంద్రం కోర్టుకి లాగిన లాగవచ్చునని అంటున్నారు. ఒక్కసారి అవినీతి కేసుల్లో ఇరుక్కుంటే.. టీడీపీపై ఇక పెద్ద మచ్చ పడ్డట్టే. మరి,ఈ గండం నుంచి టీడీపీ గట్టెక్కుతుందా?.. లేక కేంద్రం చంద్రబాబు ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Category

🗞
News

Recommended