• 6 years ago
Intelligent Movie Pre Release Event Held In Rajahmundry. Sai Dharam Tej is currently gearing up for the release of Intelligent. A VV Vinayak directorial, it is slated to hit screens this week and has created a buzz amongst fans courtesy its intriguing poster.

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ.. అత్త‌కి య‌ముడు అమ్మాయికి మొగుడు` సినిమా వంద రోజుల ఫంక్ష‌న్ త‌ర్వాత ఆ రేంజ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఫంక్ష‌న్ `ఇంటిలిజెంట్‌`. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం మాకు ఉంటుంద‌ని భావిస్తున్నాం అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.
వివి వినాయ‌క్‌గారు నాకు ఎంతో ఇష్ట‌మైన డైరెక్ట‌ర్‌. ఆయన్ని చూడ‌గానే హోమ్లీ డైరెక్ట‌ర్ అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవ‌కాశాన్ని ఆయ‌న నాకు ఇచ్చారు. ఆయ‌న చాలా పెద్ద డైరెక్ట‌ర్. ఇంకా ఎన్నో హైట్స్ ఆయ‌న చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను అని తేజు తెలిపారు.
చిరంజీవిగారు స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జెండా రెప‌రెప‌ల‌నే నా గుండె చ‌ప్పుడులుగా భావించి క‌ష్ట‌ప‌డుతుంటాను. ఎప్ప‌టికీ ఇలాగే క‌ష్ట‌ప‌డుతుంటాను. నాకు మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్‌, మెగాప‌వ‌ర్‌స్టార్‌, స్టైలిష్ స్టార్‌, వ‌రుణ్ ఇలా అంద‌రూ నాకు పంచ‌భూతాలు.

Recommended