BJP Corners Chandrababu And Pawan Kalyan

  • 6 years ago
BJP in its strategy has decided to corner Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan. And try to mull with Ysrcp jagan

వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను పోషించాల్సిన పాత్రపై ఇప్పటికే బిజెపి నాయకత్వం స్పష్టతకు వచ్చినట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయడం దాని ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను కూడా కార్నర్ చేయాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి
చంద్రబాబును బిజెపి నాయకత్వం లక్ష్యంగా చేసుకుని ఎపి రాజకీయాలను శాసించాలనే వ్యూహాన్ని బిజెపి ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుతో కలిసి పనిచేసినంత కాలం తమ పార్టీ ఎదగదనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తి స్థాయిలో తమ చెప్పుచేతల్లో ఉండవని కూడా అనుకుంటున్నట్లు తెలస్తోంది. అందువల్లనే చంద్రబాబును టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన బిజెపి నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు సీట్లు రావడం మాట అటుంచి, తమను శాసించే స్థాయికి చేరుకున్నా అశ్చర్యం లేదనేది బిజెపి ఆలోచనగా చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విమర్శలు చేస్తూ తన ఎంపీల చేత పార్లమెంటులో ఆందోళన చేయిస్తున్న చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ ఆరోపిస్తూ వస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు మాత్రం బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి జంకుతున్నట్లే కనిపిస్తున్నారు.

Recommended