YSR Congress Party chief YS Jagan Mohan Reddy on Thursday said that why Chandrababu Naidu is continuing in NDA.YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thrusday questioned that he will support who give Special Status to Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే, హోదా ఫైల్‌పై ఎవరు సంతకం పెడితే తాము వారికి మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ఎవరినీ నమ్మవద్దని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా ఏపీకి న్యాయం జరగాలన్నారు. ఎవరినీ నమ్మకుండా 25 మంది ఎంపీలను వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే, హోదా ఇచ్చిన వారికి తాము మద్దతిస్తామన్నారు.
చంద్రబాబు గోబెల్స్ ప్రచారాలను బాగా నమ్మే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మడం గోబెల్స్ సిద్ధాంతమని చెప్పారు. చంద్రబాబు తన అనుకూల మీడియాలో ఇప్పుడు అదే చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతి మొదలు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికాడన్నారు.
హోదా కావాలని మొదట చెప్పి, ఆ తర్వాత హోదా సంజీవిని కాదని చెప్పి యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో విశ్వసనీయత, క్రెడిబులిటీ, క్యారెక్టర్ చాలా ముఖ్యమని చెప్పారు. కేంద్రం మొదటిసారి హోదా ఇవ్వనని చెప్పినప్పుడే రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదన్నారు.

Category
🗞
News