• 7 years ago
Shah Rukh Khan dancing with Andre Russell in Chammak Challo. After the match with CSK, team KKR let their hair down with their boss Shah Rukh Khan. They grooved to the tunes of Chammak Challo from Ra One. The steps were taught to them by King Khan. Jamaican all-rounder Andre Russell and a few others shared the pictures and the videos of the party on social media. Watch this video for more details.

ఐపీఎల్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించి ఆడాడు ఆండ్రీ రస్సెల్. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ జట్టు సిక్సర్లతో హోరెత్తించి చెన్నై ముందు భారీ టార్గెట్‌నే ఉంచింది. సిక్సర్లతో మెరిసిపోయిన రస్సెల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు.. జట్టు స్కోరును పరిగెత్తించడంలో వేగం చూపించాడు.
అయితే ఆ మ్యాచ్ అనంతరం, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చమ్మక్ చల్లో పాటుకు సంబంధించి ఇంతకీ వీరు ఏ పాటకు స్టెప్పులేశారో తెలుసా.. షారుక్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన 'రావన్‌‌' సినిమాలోని 'చమ్మక్‌ చల్లో' పాటకు.
ఈడెన్‌గార్డెన్స్‌, చెపాక్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడిన మ్యాచ్‌లకు ఆ జట్టు సహ యజమాని షారుక్‌ఖాన్‌ హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. మ్యాచ్‌కి ముందు, తర్వాత ఆటగాళ్లతో కలిసి తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ఈ సందర్భంగా కోల్‌కతా ఆటగాడు రసెల్‌, సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కమలేశ్‌ నాగర్‌ కోటితో కలిసి షారుక్‌ ఖాన్‌ స్టెప్పులేశాడు.
ఈ వీడియోను రసెల్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఫన్‌ టైం విత్‌ ద బాస్‌' అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

Category

🥇
Sports

Recommended