• 6 years ago
Mahie Gill says that there was a time when she just stopped meeting directors at their office or took a friend along so that no one would act smart. The actor shares that there have been instances when people tried to make indecent advances to her in return for work. Mahie said, I had to meet a director. he told me, ‘If you wear a suit and come, nobody is going to cast you in a film.’ Then, I met another director and he tells me, ‘I want to see how you look in a nightie’. So, you see, there are idiots all around.”
బాలీవుడ్‌లో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారనే పేరు అందాల తార మహీగిల్‌కు ఉంది. 2009లో దేవ్ డీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఏ విషయాన్నైనా ముందు, వెనుకా ఆలోచించకుండా బయటపెట్టేస్తుంది. తాజాగా తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల మీడియా ముందు బయటపెట్టారు. హాలీవుడ్ ‌దర్శకుడు వెయిన్‌స్టెయిన్ దుశ్చర్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, ఇతర రంగాల్లో ఒక్కొక్కరు క్యాస్టింగ్ కౌచ్ గురించి బయపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీ గిల్ చెప్పిన విషయాలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.
ఓ సారి నేను ఓ డైరెక్టర్‌ను కలిశాను. అప్పుడు నేను సల్వార్ సూట్ వెళ్లాను. అందుకు నీవు ఇలా సల్వార్ సూట్‌లో వస్తే ఎవరూ వేషాలు ఇవ్వరు అని అన్నాడు. మరో డైరెక్టర్‌ను కలిస్తే ఆయన ‘నిన్ను నైటీలో చూడాలనుకొంటున్నాను అని అన్నాడు అని మహీ గిల్ అన్నారు.
సినీ అవకాశాల కోసం వచ్చినప్పుడు ముంబై నాకు చాలా కొత్త. ఇక్కడ ఎవరు మంచి వాళ్లో.. ఎవరు చెడ్డవాళ్లో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ముంబైలోని సినీ పరిశ్రమలో ఉన్న మాటలు వినాల్సి వచ్చేది. మంచి వ్యక్తులను ఎవరని గుర్తించడం.. అలాంటి వారిని కలవడం చాలా కష్టమయ్యేది అని గిల్ వెల్లడించింది.
#mahie gill tigmanshu
#dhulia saheb
# bollywood

Recommended