• 7 years ago
Singer Pragathi Clarifies Relation With Ashok Selvaraj .Playback singer Pragathi, who rose to fame with her stint in Super Singer, took to Instagram to clear rumours on her relationship with actor Ashok Selvan. Last week, there were reports claiming that the couple will get married soon.


తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ప్రముఖ గాయని ప్రగతి స్పందించారు. నటుడు అశోక్ సెల్వన్‌తో పెళ్లి చోసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదు అని ఆమె వెల్లడించారు. గత కొద్దికాలంగా అశోక్ సెల్వన్‌తో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రగతి, అశోక్ మధ్య మంచి స్నేహానికి మించిన బంధం ఉందని కథనాలు వస్తుంటాయి. వారిద్దరూ సోషల్ మీడియాలో బహిరంగంగా తమ అనుబంధాన్ని గురించి వ్యక్తీకరించుకొంటారు. కొన్ని సందర్బాల్లో అశోక్‌తో ఉన్న రిలేషన్‌ గురించి ప్రగతి చెప్పుకొన్నారు. దాంతో వారి మధ్య ఏదో బంధం ఉందని గుసగుసలు వచ్చాయి.
మీడియాలో తన పెళ్లి వార్తలతో విసుగు చెందిన ప్రగతి ఇటీవల ఓ భారీ పోస్టును చేసింది. అశోక్ ఫొటోను జత చేసింది. అశోక్‌తో రిలేషన్ గురించి నేరుగా వివరణ ఇవ్వాలనుకొంటున్నాను. ఆయనతో పెళ్లి జరుగబోతుందనే వార్తల గురించి వివరంగా చెబుతాను. ప్రస్తుతం నా వయసు 22 సంవత్సరాలు. నా దృష్టి అంతా కెరీర్‌పైనే అని వెల్లడించారు.
దాదాపు కాలేజీ స్టూడెంట్ వయసు నాది. అప్పుడే పెళ్లిపై ధ్యాసలేదు. నా ఫ్యాన్స్‌ చూపించే ఆదరణతో సంతోషంగా ఉన్నాను. నేను ఎవరితో సీరియస్ రిలేషన్ షిప్ ఎవరికేం తెలుసు. నా పెళ్లిపై వస్తున్న వార్తలతో పూర్తిగా నిరాశ చెందాను అని ప్రగతి అన్నారు.

Recommended