• 6 years ago
Ex-Delhi Cop, retired ACP Ved Bhushan claims Dawood Ibrahim may have been involved in Sridevi’s . Raising questions on the investigation of Dubai police, Bhushan had said that Dawood's influence in the foreign country might have caused a faulty probe. The retired cop, who runs a private investigation agency, said that he has evidence to back his claim, which he would reveal at the right time.
#Sridevi
#DawoodIbrahim


ప్రముఖ నటి శ్రీదేవి మరణం ప్రమాదం కాదు, హత్యే అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. ఆమె మరణం వెనక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండొచ్చు అని మాజీ పోలీసుల అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె పేరు మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ డబ్బు కోసమే ఆమెను హత్య చేసి ఉంటారనే సందేహాలకు తాజాగా ఆరోపణలు మరింత బలం ఇస్తున్నాయి. శ్రీదేవి మరణంపై విచారణ జరిపించాలని కోరుతూ సునీల్ సింగ్ అనే ఫిల్మ్ మేకర్ ఇటీవల సుప్రీం కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది.
శ్రీదేవి పేరు మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఓమన్ దేశంలో కొనుగోలు చేశారని, ఆ పాలసీ నిబంధనల ప్రకారం శ్రీదేవి దుబాయ్‌లో మరణించినపుడే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని కోర్టులో సునీల్ సింగ్ లాయర్ వాదించారు. ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తూ రిటైర్డ్ ఏసీపీ వేద్ భూషణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా శ్రీదేవి మరణంపై రిటైర్డ్ ఏసీపీ వేద్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేవ్ భూషన్ ప్రస్తుతం ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నడుపుతున్నాడు. శ్రీదేవి మరణం వెనక అండర్ వరల్డ్ డాన్, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు.
దుబాయ్ పోలీసులు శ్రీదేవి మరణంపై జరిపిన ఇన్వెస్టిటేషన్ గురించి దేవ్ భూషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అక్కడి పోలీస్ వ్యవస్థను సైతం ప్రభావితం చేయగల నెట్వర్క్ దావూద్‌కు ఉందని ఆయన అన్నారు.
దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన హోటల్‌కు ఓనర్ కూడా దావూద్ ఇబ్రహీమ్ అని వేద్ భూషణ్ వెల్లడించారు. వేద్ బూషణ్ చెబుతున్న విషయాలు శ్రీదేవి మరణంపై అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.

Recommended