What Is Reverse Ball Swing??

  • 6 years ago
Professor Sanjay Mittal and his two students Ravi Shakya and Rahul Despande of the Institute’s Aerospace department were conducting a series of research to unravel the mystery behind different swings by pacers on the cfricket pitch.
#cricket
#iit
#kanpur
#kuldeepyadav
#India

ఎలాంటి బంతినైనా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్లను తికమక పెట్టేందుకు ఫాస్ట్‌ బౌలర్లకు ఏకైక అస్త్రం స్వింగ్‌. నేరుగా దూసుకొచ్చే బంతులను ఎంతో సులువుగా బౌండరీలకు తరలించే బ్యాట్స్‌మెన్లు స్వింగ్‌ విషయానికొస్తే.. ఆ బంతిని నిలువరించడానికే అష్టకష్టాలు పడతారు. ఇలాంటి స్వింగ్‌ బంతులను విసరాలని అందరూ అనుకుంటారు. మరి స్వింగ్‌ అంటే ఏమిటి.? ఫాస్ట్‌బౌలర్లు అందరూ ‌స్వింగ్‌ చేయొచ్చా.?ఈ సందేహాలకు కాన్పూర్‌ ఐఐటీ సమాధానమిస్తోంది. ఇదేం పెద్ద విషయం కాదంటూ తేల్చేసింది. క్రికెట్‌కీ కాన్పూర్‌ ఐఐటీకీ మధ్య సంబంధం ఎలా మొదలైందంటే.. కాన్పూర్‌ ఐఐటీలో అంతరిక్ష విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సంజయ్‌ మిట్టల్‌, విద్యార్థులు రవి శక్య, రాహుల్‌ దేశ్‌పాండే రివర్స్ స్వింగ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి, అసలు రివర్స్‌ స్వింగ్‌ ఎలా ఏర్పడుతుంది... అనే విషయంపై పరిశోధనలు చేసి కొన్ని విశ్లేషణలను మనముందుంచారు.

Category

🥇
Sports

Recommended