• 7 years ago
దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక విశ్లేషకుడు బాబు గోగినేని మెడకు ఇటీవల నమోదైన కేసు బలంగా చుట్టుకొంటున్నట్టు కనిపిస్తున్నది. గత కొద్దికాలంగా ఈ కేసును పక్కన పెట్టిన తెలంగాణ పోలీసులు మళ్లీ తిరుగదోడుతున్నట్టు ఓ వార్త వెలుగు చేసింది. ఈ కేసుతోపాటు మరికొన్ని తీవ్ర ఆరోపణలు ఉన్నందున బిగ్‌బాస్ నుంచి రప్పించి విచారణ చేపడుతారనే వార్తలు కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
ప్రజాజీవనంలో మత విద్వేశాలను రెచ్చగొట్టడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే హైకోర్టు సూచనల మేరకు బాబు గోగినేనిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కాబట్టి కేసు తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంలో తీవ్రంగా స్పందిస్తే ఆయనకు ఇబ్బందులు తప్పవనే మాట వినిపిస్తున్నది.

Recommended