• 6 years ago
Jana Sena ready to go with Left Parties in next elections. Already Janasena and left parties are protesting over public issues in Andhra Pradesh and Telangana.
#janasena
#pawankalyan
#andhrapradesh
#CPI
#CPM
#Elections


వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయాలని జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో వామపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ, పొత్తుపై కూడా చర్చించారు. ఈ భేటీలో 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. వారం రోజులలో విజయవాడలో జనసేన, లెఫ్ట్ పార్టీల ప్రత్యేక సదస్సు జరగనుంది. భూసేకరణ, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యలు, పరిష్కారం అజెండాను ఖరారు చేయనున్నారు. వీరు ఉమ్మడి అజెండాతో ముందుకు సాగనున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. అప్పటి నుంచి పవన్ లెఫ్ట్ పార్టీలతో దోస్తీ చేస్తున్నారు. చాలా రోజులుగా చర్చలు సాగుతున్నాయి. లెఫ్ట్ పార్టీలతో వెళ్లేందుకు తాను సిద్ధమని పవన్, జనసేనతో తాము కలిసి నడుస్తామని లెఫ్ట్ పార్టీలు పలుమార్లు చెప్పాయి. ఇప్పుడు జనసేన నిర్ణయించింది.

Category

🗞
News

Recommended