• 6 years ago
There is still a few months for the AP Assembly polls. The party's national president Chandrababu Naidu was intensely decided to announce the candidates. The list is also known to have been finalized.
ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో సర్వే నివేదికలను పరిశీలించి అభ్య‌ర్థుల అంశంలో తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బ్యాక్‌ ఆఫీస్ నుంచి వచ్చిన నివేదికలతో పాటు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ ఉంది ? శాసనసభ్యుల తీరుపై పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నియోజకవర్గంలో మండలస్థాయి ద్వితీయశ్రేణి నేతలతో వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ? అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా?. వంటి పలు అంశాలనూ సీఎం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు స‌మాచారం. ఈ వడపోతల అనంతరం ముఖ్యమంత్రి 75 నుంచి 100 స్థానాలకు అభ్యర్ధులను త్వరలోనే ప్రకటిస్తారన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోన్న స‌మాచారం.
#APAssemblypolls
#candidates
#ChandrababuNaidu
#2019elections
#kcr

Category

🗞
News

Recommended