• 5 years ago
The India team has ended a one-day series against New Zealand. India's strongest total in the final one-day match against Wellington was New Zealand defeating New Zealand by 35 runs. India's 4-1 win over the five-match one-day series will be played in three T20s from Kiwis on Wednesday.
#INDVsNewZealand
#Ambatirayudu
#vijayshankar
#5thodi
#rohitsharma
#hardikpandya
#wellington

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలిపోయింది.
భారత బౌలర్లలో చాహల్ (3/41), మహ్మద్ షమీ (2/35), హార్దిక్ పాండ్య (2/50) అద్భుత ప్రదర్శన చేశారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసింది.
253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలింది. దీంతో రోహిత్‌ సేన 35 బంతులు మిగిలి ఉండగానే 35 పరుగులతో విజయం సాధించింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌(8), కొలిన్‌ మున్రోలను ఆరంభంలోనే షమీ పెవిలియన్‌కు చేర్చాడు. కేదార్ జాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్‌ విలియమ్సన్‌(39) శిఖర్ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత కొద్దిసేపటికే లాథమ్‌(37), గ్రాండ్‌హోమ్‌(11)లను చాహల్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత మరో 41 పరుగుల అనంతరం జేమ్స్ నీషమ్‌(44) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో బంతిని స్వీప్ చేసేందుకు నీషమ్ ప్రయత్నించాడు. అయితే, అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా వెళ్లింది.

Category

🥇
Sports

Recommended