• 5 years ago
Star cricketer Virat Kohli has postponed the RP-SG Indian Sports Honours, which was to take place on Saturday (February 16), as a "mark of respect" to the CRPF personnel martyred in the Pulwama incident.
#pulwamaIncident
#rpsgindiansportshonours
#gautamgambhir
#viratkohli
#virendrasehwag
#sureshraina
#shikhardhawan
#pullelagopichand
#sanjivgoenka
#rishabpanth
#maheshbhupathi


పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతి ఏటా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన ఫౌండేషన్‌ ద్వారా అందించే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు విరాట్‌ కోహ్లీ తన ఫౌండేషన్‌ ద్వారా అవార్డులను అందజేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 44 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం మంచిది కాదని అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కోహ్లీ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఆర్పీ-సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ భాగస్వామ్యంతో విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ ప్రతి ఏటా ఈ అవార్డులను అందజేస్తుంది.
"ఆర్పీ-ఎస్జీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్‌ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం" అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ఈ మేరకు క్రీడాకారులు, ప్రముఖులకు సమాచారం అందించినట్లు కోహ్లీ తెలిపాడు

Category

🗞
News

Recommended