• 6 years ago
The West Indies cricket board has announced that Chris Gayle will retire from One-day Internationals after the ICC Cricket World Cup 2019 to be held in England.
#iccworldcup2019
#chrisgayle
#gayleretirement
#westindies
#gayleodis
#england
#toronto
#india
#shoaibmalik

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌ ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. మేలో ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్ టోర్నీ వన్డేల్లో అతడికి చివరి టోర్నీ. వరల్డ్‌కప్ అనంతరం తాను వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

39 ఏళ్ల గేల్‌ 1999 సెప్టెంబరులో భారత్‌పై టొరంటో వేదికగా జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. వన్డే ఫార్మాట్‌లో బ్రియాన్‌ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన వెస్టిండిస్ బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేలే కావడం విశేషం. అంతేకాదు వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన (2015 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్‌ క్రికెటర్‌ గేలే.

Category

🥇
Sports

Recommended