Chief selector MSK Prasad agrees upon the idea of playing Virat Kohli at No.4 in World Cup 2019. He hailed coach Ravi Shastri's idea as a 'wonderful thought'.
#ViratKohli
#SunilGavaskar
#worldcup2019
#Souravganguly
#msdhoni
#MSKPrasad
#rohithsharma
#rishabpanth
#cricket
#teamindia
ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి? అనే దానిపై గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ల మధ్య చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడిస్తామని.. ఇటీవల టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయమై రవిశాస్త్రికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. వన్డేల్లో సుదీర్ఘకాలంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 59.50 సగటుతో 10,533 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో 39 శతకాలు ఉండగా.. అందులో ఏకంగా 32 సెంచరీలు నెం.3లో ఆడి చేసినవే కావడం విశేషం.
అయితే దీనిపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ..రవిశాస్త్రిది తెలివి తక్కువ నిర్ణయమని మండిపడ్డాడు. అయితే.. రవిశాస్త్రి నిర్ణయానికి సునీల్ గవాస్కర్ మాత్రం మద్దతుగా నిలవగా.. తాజాగా ఆ జాబితాలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా చేరాడు.
‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై రవిశాస్త్రి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయితే.. టోర్నీ మొత్తం కాదు.. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే ఈ ప్రయోగం చేస్తాం. ఎందుకంటే..? విరాట్ కోహ్లీ నెం.3లో అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. అతను ఇప్పుడు ప్రపంచ నెం.1 బ్యాట్స్‌మెన్ కూడా. కానీ.. జట్టుకి అవసరమైనప్పుడు అతడ్ని నాలుగో స్థానంలో ఆడించే ప్రయత్నం చేస్తాం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు.
ప్రపంచకప్‌లో ఏదైనా స్వింగ్‌కి అతిగా అనుకూలించే పిచ్ ఎదురై.. ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకుంటే..? అప్పుడు కోహ్లీ వికెట్‌ను కాపాడుకునేందుకు బంతి పాత బడే వరకూ అతడ్ని క్రీజులోకి పంపకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి జరుపుతాం అని రవిశాస్త్రి ఇటీవల వెల్లడించాడు.

Category
🥇
Sports