• 6 years ago
World Cup 2019:"India should not play Pak in the World Cup. India are powerful enough to win the World Cup without having to play Pak," Harbhajan Singh told to media.
#WorldCup2019
#HarbhajanSingh
#teamindiasquad
#msDhoni
#viratkohli
#rohithsharma

పుల్వామా ఘటన తరువాత యావత్ భారత్ ప్రపంచ కప్ లో పాక్ తో ఆడకూడదని ముక్త కంఠం తో చెబుతుంది. ఇప్పటీకే రాజీవ్ శుక్లా మాట్లాడుతూ "ఇప్పటి వరకు క్రికెట్ , రాజకీయాలు వేర్వేరు అని మాట్లాడినాను. కానీ ఈ ఘటన తో రెండు దేశాల మధ్య సంభందాలు దాదాపుగా తెగినట్టేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ తన ఉగ్రవాద బుద్ది ని మార్చు కుంటేనే భారత్- పాకిస్తాన్‌కు మ్యాచ్‌లు సాధ్యం" అని చెప్పాడు.
పాకిస్తాన్ ఆటగాళ్ల ఫోటోలను అలాగే ఇమ్రాన్ ఖాన్ ఫోటోలకు పరదాన్ని కప్పి ఉంచడాన్ని శుక్లా సమర్ధించాడు.
"ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుందా లేదా అని అంశం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది" అని శుక్లా తెలిపాడు. అయితే ఇప్పడూ ఇదే అభిప్రాయాన్ని క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తపరిచారు "ప్రపంచ కప్ లో పాక్ తో భారత్ తో ఆడకూడదని , ఇది చాలా పెద్ద తప్పిదమని, పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని" చెప్పాడు.
ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో ఆడకుండానే భారత్ ప్రపంచ కప్ గెలిచే సత్తా గల టీం అని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఇక ఎటువంటి సంభందాలు పెట్టుకోకూడదని , మిగతా అన్ని క్రీడల్లోను పాక్ ను భహిష్కరించాలని భజ్జి అభిప్రాయ పడ్డాడు.
అయితే ఢిల్లీ లో జరిగే ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ కు పాక్ ఆటగాళ్లకు భరత్ హై కమిషన్ వీసాలు ను మంజూరు చేసింది. అయితే పుల్వామా ఘటన నేపథ్యంలో వీరికి వీసాలు వస్తాయో రావో అని సందేహాలు ఉండేయి.

Category

🥇
Sports

Recommended