• 5 years ago
IPL 2019 schedule for the first two weeks has been announced, Chennai Super Kings will face Royal Challengers Bangalore in the opening match on March 23.
#IPL2019schedule
#BCCI
#RoyalChallengers
#ChennaiSuperKings
#CSKVsRCB
#MSDhoni
#Viratkohli
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.
ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్‌లో ఐపీఎల్ షెడ్యూల్‌ని ఉంచింది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ ట్విట‌ర్‌లో ఉంచారు.
మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. నగరంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న రాజ‌స్థాన్‌ vs స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌తో ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Category

🥇
Sports

Recommended