• 6 years ago
Huge Cash recovered in Krishna District by On duty Police and Election Staff after the jointly launch massive check at Enikepadu Check Post in Vijayawada rural limits. Total 1.90 Lakhs rupees recovered from a cement lorry at Enikepadu Check Post. Police seized the amount and detained driver.
#appssemblyelections2019
#cash
#krishnadistrict
#lorry
#vijayawada
#Enikepaducheckpost
#Police
#ElectionStaff

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు- ఎన్నికల సిబ్బంది, పోలీసులు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. విజయవాడ వైపునకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఎనికేపాడు చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కోటి 90 లక్షల రూపాయలు ఉన్నట్లు తేలింది. ఓటర్లకు పంచడానికే ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. కోటి 90 లక్షల రూపాయలకు సంబంధించిన ఎలాంటి పత్రాలు తన వద్ద లేవని పోలీసులు నిర్ధారించారు. పోలింగ్ కు ముందురోజు రాత్రి ఈ డబ్బును ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నామని కృష్ణాజిల్లా పోలీసులు తెలిపారు. ఏలూరుకు డబ్బును తరలిస్తున్నట్లు సమాచారం.

Category

🗞
News

Recommended