• 6 years ago
The Election Commission of India(ECI) has directed media to conduct exit polls from 6:30 pm onwards.ECI, in the exercise of the powers under sub-section(1) of Section 126A of the Representation of the People Act, 1951 has notified that the period between 7:00 AM on April 11 and 6:30 PM on April 19 as the period during which conducting any exit poll is prohibited.
#exitpolls
#apelection2019
#electioncommission
#lagadapatirajagopal


ఇప్పటి వరకు సాయంత్రం ఆరుగంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇస్తామంటూ తెగహడావుడి చేసేసిన మీడియాకు ఎన్నికల సంఘం మరో అరగంట పొడిగిస్తూ సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించొచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిరవహించరాదని 1951 ప్రజాప్రతినిధుల చట్టం కల్పించిన హక్కు ద్వారా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలకు జరిగిన నేపథ్యంలో ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఎలాంటి మాధ్యమాల ద్వారా కానీ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టరాదని ఒకవేళ బయటపెడితే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దశల వారీగా జరిగిన ఎన్నికల్లో ఎన్నికలు ముగిసిన 48 గంటల పాటు ఒపీనియన్ పోల్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ ఇతరత్ర సర్వేలపై కానీ చర్చించడాన్ని కూడా సీరియస్‌గా పరిగణించింది ఎన్నికల సంఘం.

Category

🗞
News

Recommended