• 3 years ago
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా గుర్తింపు పొందిన హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు గత యేడాది విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ అంశంపై భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత సమంత సినిమాలో మరింత ఎక్స్‌పోజింగ్ చేస్తూ నటించారు. తాజాగా వచ్చిన "పుష్ప" చిత్రంలో ఏకంగా ఓ ఐటమ్ సాంగ్‌లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలో కొన్నినెలల క్రితం తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన విడాకుల ప్రకటనను సమంత ఉన్నట్టుండి తన ఖాతా నుంచి ఇపుడు తొలగించారు.

Category

🗞
News

Recommended