• 3 months ago
Telangana Budget 2024-25 Today: గ్యారంటీల అమలుకు పెద్దపీట వేస్తూ వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇవాళ ఉభయసభల ముందుకు రానుంది. గతంలో నాలుగు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్ అనుమతి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం... 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. మొదటి త్రైమాసికం ఆదాయాన్ని అంచనా వేసుకుని ప్రాధాన్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేయనుంది. ఓటాన్ అకౌంట్ సమయంలో రెండు లక్షల 75 వేల కోట్లతో పద్దు పెట్టిన ప్రభుత్వం, ఈ సారి రెండు లక్షల 90 వేల కోట్లకు పైగా ప్రతిపాదించవచ్చని అంచనా.

Category

🗞
News

Recommended