తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం ఇష్టంలేక పర్య

  • yesterday
Home Minister Anitha Sensational Comments on YS Jagan : తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం ఇష్టంలేక పర్యటన రద్దు చేసుకున్న జగన్‌ కుంటిసాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లికి, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఏనాడూ తిరుమల లడ్డూ తినని జగన్‌ నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్‌ను దేశ బహిష్కరణ చేయడమే సరైనదని అనిత అన్నారు.

Category

🗞
News

Recommended