• 6 years ago
YSR Congress party president YS Jagan'Sakshi media fired at Vemuri Radhakrishna's Andhrajyothy terming it as yellow media. Sakshi media published supporting YSR Congress party president YS Jagan in Indu Tech case, in which Indian government recieved notice from Maritius.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు జారీ అంటూ ఆంధ్రజ్యోతి రాసిన వార్తాకథనంపై సాక్షి మీడియా దుమ్మెత్తి పోసింది. ఆంధ్రజ్యోతి మీడియాను నేరుగా ప్రస్తావించకుండా ఎల్లో మీడియా అంటూ తీవ్రంగా విరుచుకుపడింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజీలేని పోరాటానికి పెరుగుతున్న ప్రజా మద్దతు చూసి ఓర్వలేని ఎల్లో మీడియా మరో దిగజారుడు ప్రచారానికి పూనుకుందని సాక్షి వ్యాఖ్యానించింది. చంద్రబాబు కోంస.. హోదా ఒత్తిడిలో ఎల్లో ఎత్తుగడ అనే శీర్షికతో ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.
బట్టకాల్చి ముఖాన వేసేందుకు ఎల్లో మీడియా విఫలయత్నం చేసిందంటూ సాక్షి మీడియా వ్యాఖ్యానించింది. జగన్ కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చాయంటూ దీనికి జగన్ కారణమంటూ ఎల్లో మీడియా విషం చిమ్మే ప్రయత్న చేస్తోందని వ్యాఖ్యానించింది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కాగానే ప్యారడైజ్ పేపర్ల పేరుతోనూ అనుకూల మీడియాలో జగన్‌పై దుష్ప్రచారం చేసేందుకు ఇలాగే ప్రయత్నించారని సాక్షి మీడియా రాసింది. విదేశాల్లో నత పేరుపై ఒక్క రూపాయి అస్తి ఉన్నట్లుు 15 రోజుల్లో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే సిఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ సవాల్ చేస్తే తొక ముడిచి కూర్చున్నారని వ్యాఖ్యానించింది.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేసులో మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోడీకి నోటీసు జారీ చేసిందంటూ వచ్చిన వార్తలపై సాక్షి మీడియా భగ్గుమంది. జగన్‌కు ఏం సంబంధమంటూ ప్రశ్నించింది. అందుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చింది. దాన్ని జగన్ వాదనగా చెప్పవచ్చు. ఇందూ టెక్ కంపెనీకి, మారిషస్ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదంలో భారత ప్రభుత్వానికి నోటీసులు రావడాన్ని జగన్‌కు ఆపాదిస్తూ విషపూరిత ప్రచారానికి దిగారని దుయ్యబట్టింది.

Category

🗞
News

Recommended